మోడీ దారిలో...పెద్ద నోట్లు రద్దు చేసిన వెనిజులా
posted on Dec 12, 2016 3:09PM
అవినీతిని అంతం చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోడీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. ఆ నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి విమర్శలు ఎదురవుతున్నా సరే..మోడీ మాత్రం వెనక్కుతగ్గలేదు. అయితే ప్రపంచంలోని చాలా దేశాలు మాత్రం మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. తాజాగా భారత్ దారిలో పెద్ద నోట్లు చేసింది వెనిజులా. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టే నిమిత్తం పెద్దనోటు 100 బొలివర్‌ను రద్దు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు నికోలస్ మాడురో ప్రకటించారు. రద్దయిన పెద్దనోటు స్థానంలో నాణేలను ప్రవేశపెట్టనున్నామని, ఆ ప్రక్రియను 72 గంటల్లోనే ముగుస్తుందని చెప్పారు. అంతేకాకుండా దేశంలో నెలకొన్న ఆహార కొరత కూడా తీరుతుందని నికోలస్ అభిప్రాయపడ్డారు.