ఈదురుగాలులకు ట్యాంకర్ బోల్తా..

బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తుఫాను కారణంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలుల తాకిడికి నెల్లూరు జిల్లా సూళ్లురుపేట వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ వద్ద నుంచి చమురు వృథాగా పోతోంది. బిజీగా ఉండే జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.