తుఫానుపై రైల్వేశాఖ హెల్ప్‌లైన్
posted on Dec 12, 2016 2:13PM
వార్ధా తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. బలమైన ఈదురుగాలుల కారణంగా ఎక్కడికక్కడ చెట్లు, స్థంభాలు నేలకొరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో పలు మార్గాల్లో రైల్వే సేవలు నిలిచిపోయాయి. విజయవాడ-చెన్నై మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లీంచగా..నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల సహాయార్థం ప్రధాన రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైళ్ల సమాచారం కోసం ప్రయాణికులు ఆయా నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హెల్ప్‌లైన్ నంబర్లు:
ఆంధ్రప్రదేశ్ - 0866 248800
విజయవాడ - 0866 2575038, 1072
నెల్లూరు - 0861 2345864, 7702774104
గూడూరు - 9604506841