సిఐడి కస్టడీలో వల్లభనేని వంశీ
posted on Mar 20, 2025 2:50PM
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడు రోజుల పాటు సిఐడి కస్టడీ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారి చేసింది. ఈ కేసులో వంశీ ఎ 71 గా ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ఈ నెల 28 వరకు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సిఐడి పోలీసులు వంశీని కస్టడీలో తీసుకున్నారు. ఇదే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇరు వర్గాల వాదనలు ముగిసినప్పటికీ ఆయనకు బెయిల్ రాలేదు. గత వైకాపా హాయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అప్పట్లో 54 రోజుల పాటు రిమాండ్ చేస్తూ మహిళా న్యాయమూర్తి హిమబిందు తీర్పు చెప్పారు. ప్రస్తుతం వంశీ కేసులో హిమబిందు న్యాయమూర్తిగా ఉన్నారు. సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో వంశీ విజయవాడ జైల్లో ఉన్నప్పుడు వైకాపా అధినేత జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల వల్లే వంశీకి బెయిల్ రాలేదని చర్చ జరుగుతుంది. అధికారుల బట్టలూడదీస్తామనే జగన్ వ్యాఖ్యలవల్లే వంశీకి బెయిల్ రాలేదని ప్రచారం జరుగుతుంది. వంశీపై మూడు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వ్యాపార పనుల నిమిత్తం తాను అమెరికా వెళ్లాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని వంశీ ప్రాధేయపడినప్పటికీ బెయిల్ రాలేదు