ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ పై ఎఫ్ ఐఆర్ కొట్టివేసిన కోర్టు
posted on Mar 20, 2025 2:43PM

ఫోట్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి విదితమే.
అయితే ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని హరీష్ రావు తన క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో హరీష్ రావు ప్రమేయానికి సంబంధించిన ఆదేశాలు చూపాలని కోర్టు కోరింది. అందుకు పోలీసుల తరఫు న్యాయవాదది సమయం కోరినా, ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు సరికాదని పేర్కొంటూ కోర్టు హరీష్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.