వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఎ2 సునీల్ యాదవ్?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర ఉందని చెప్పారు. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? హత్యకు కుట్రపన్నింది ఎవరు అన్న విషయాలను వెల్లడిస్తానని మీడియా సమావేశంలో చెప్పారు. 
గురువారం (మార్చి20) కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్ యాదర్ ఈ హత్య విషయంలో తాను ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాననీ, అన
వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గన్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్‌-2)గా ఉన్న సునీల్ యాద‌వ్ సైతం.. అప్రూవర్‌గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు చాలానే కుట్ర జ‌రిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవ‌రున్నారు? అస‌లు ఈ ప్లాన్ ఎవ‌రిది అనేది చెప్పేస్తా అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉద‌యం క‌డ‌ప ఎస్పీ కార్యాల‌యానికి వ‌చ్చిన సునీల్‌.. మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసు విషయంలో ఇంత వరకూ మౌనంగా ఉన్నాననీ, కానీ ఇప్పుడు తనకే బెదరింపులు వస్తున్నాయన్నారు.   తాను జైల్లో ఉన్న‌ప్పుడు, ఇప్పుడు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా త‌న‌కు వైసీపీ నాయ‌కుల నుంచి బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని, తనకు ప్రాణ భయం ఉందనీ సునీల్ చెప్పారు. అయితే భయపడుతూ ఎన్నాళ్లు బతకాలని భావించి.. ఇప్పుడు వివేకా హత్య వెనుక కుట్ర కోణాన్ని, హత్య సూత్రధారులు, పాత్రధారుల ఎవరన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో బెయిలుపై ఉన్నసునీల్ యాదవ్, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడీ వివరాలు బయటపెట్టడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు.
ఇప్పటికే వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి సైతం బెదరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, భద్రత కలిగించాలనీ  కోరుతూ కోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఏ2 సునీల్ యాదవ్ సైతం బెదరింపులు వస్తున్నాయంటూ జీల్లా ఎస్పీని ఆశ్రయించడం గమనార్హం.