రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి
posted on Mar 29, 2015 10:42AM

ఆదివారం నాడు జరిగిన వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 12 మంది మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మోత్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదం 9 మంది మరణించారు. 11 మంది గాయపడ్డారు. లారీ, ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు వున్నారు. అలాగే మెదక్ జిల్లా చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ దగ్గర జాతీయ రహదారి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లోని మియాపూర్ జేపీ నగర్‌కి చెందిన వంగ పుష్పవతి (50), యశశ్విన్ (5), రత్నరెడ్డి (60) కారులో బాసర ఆలయానికి బయల్దేరారు. చేగుంట సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును మరోకారు ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. ముగ్గురూ అక్కడికక్కడే మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.