‘మా’ పోలింగ్
posted on Mar 29, 2015 9:45AM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల పోలింగ్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎం) వినియోగిస్తున్నారు. ‘మా’లోని 702 మంది సభ్యులు ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ‘మా’ అధ్యక్ష పదవి ఎన్నికపై సినిమా పరిశ్రమతోపాటు తెలుగు ప్రజల మధ్య ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధ ప్రధానంగా పోటీలో వున్నారు. ‘మా’ ఎన్నికల విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను వీడియో తీస్తున్నారు. కోర్టు ఆదేశాల తర్వాతే ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరుగుతుంది.