మెంటల్ ఎయిర్‌లైన్స్!

అమెరికా విమానాల్లో పనిచేసేవాళ్ళు మరీ దుర్మార్గంగా వున్నారబ్బా.. అమెరికాలో వుండే జెన్నా అనే ఒక అమ్మాయి తన కొడుకుని తీసుకుని  శాన్‌ఫ్రాన్సిస్కో నించి ఆస్టిన్ వెళ్ళడానికి విమానం ఎక్కింది. విమానం ఎక్కిన సమయంలో అక్కడ వున్న స్టాఫ్ ఒకావిడ మన జెన్నాకి బోర్డింగ్ పాస్ ఇచ్చింది. బోర్డింగ్ పాస్ తీసుకున్న జెన్నా ‘థాంక్యూ మేడమ్’ అనాల్సింది పొరపాటుగా ‘థాంక్యూ సర్’ అంది. అంతే, బోర్డింగ్ పాస్ ఇచ్చిన సుందరాంగికి బోలెడంత కోపం పొడుచుకొచ్చేసింది. నన్నుసార్ అంటావా అని, జెన్నాని, ఆమె కొడుకుని విమానంలోంచి కిందకి దించేసింది. పాపం జెన్నా అక్కడే వున్న విమానం సిబ్బందికి తన గోడు వెళ్ళబోసుకుంది. పైన ఒక ‘సార్’ మమ్మల్ని విమానంలోచి కిందకి దించేశాడు. ఆయనకి మీరైనా చెప్పండి అని మొత్తుకుంది. దాంతో ఆ సిబ్బంది కూడా జెన్నా మీద సీరియస్ అయ్యారు. నిన్ను విమానంలోంచి దించేసింది అబ్బాయి కాదు.. అమ్మాయి అని చెప్పారు. మేడమ్ అనకుండా సార్ అంటే మేడమ్‌కి కోపం రాదా అని మన జెన్నా మీదే సీరియస్ అయ్యారు. దాంతో జెన్నా నాలుక్కరుచుకుంది.. పొరపాటున సార్ అన్నా.. అయాం వెరీ సారీ అన్నా వాళ్ళు వినలేదంట. చివరికి జెన్నాని ఎక్కించుకోకుండానే విమానం వెళ్ళిపోయిందట. ఇదెక్కడి వెరైటీ గొడవరా మావా...