లక్కు అంటే ఇదే మావా..!

మనకు డబ్బు రావాలని రాసి వుందనుకోండి... కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి.. డబ్బు పోవాలని రాసి వుందనుకోండి.. ఏనుగు మింగిన వెలక్కాయలో గుజ్జు ఎలా మాయమైపోతుందో... అలాగే మాయమైపోతుంది.  అమెరికాలోని ఆక్లాండ్ కౌంటీలో వుండే ఒక పెద్దాయనకి రెగ్యులర్‌గా లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు వుంది. ఆయన ఎప్పుడూ మెగా మిలియన్స్ అనే పేరు వున్న లాటరీ టిక్కెట్లే కొనేవాడు. వేరే కంపెనీ టిక్కెట్లు కొనమంటే కొనేవాడు కాదు.. అయితే, మొన్నీమధ్య ఆయన లాటరీ టిక్కెట్లు కొనడానికి వెళ్ళాడు. ఆయన ఎప్పట్లాగానే మెగా మిలియన్ లాటరీ టిక్కెట్లే కొనాలి కదా? కానీ బుర్రలో ఏ బుద్ధి పుట్టిందోగానీ, తన కొనే లాటరీ టిక్కెట్ల బ్రాండ్ మార్చాడు. ఫాంటసీ ఫైవ్ అనే కంపెనీ లాటరీ టిక్కెట్లు కొన్నాడు. కట్ చేస్తే, ఆ అదృష్టవంతుడికే జాక్‌పాట్ తగిలింది. మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? మన ఇండియన్ కరెన్సీతో పోల్చితే, అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు. నిజంగా ఏ దేవుడు కరుణించాడోగానీ, చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయం అతని దరిద్రం వదిలిపోయేలా చేసింది.