వాచిపోయింది.. దొరికింది..!

అమెరికా దేశానికి 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్డ్ గురించి చాలామందికి తెలిసే వుంటుంది. 1898లో ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యారు. రూజ్‌వెల్డ్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన అక్క ఆయనకో వాచ్‌ని గిఫ్ట్.గా ఇచ్చింది. అది చేతికి పెట్టుకునే వాచ్ కాదు.. జేబులో పెట్టుకునే వాచ్. రూజ్‌వెల్డ్ ఆ వాచ్‌ని జీవితాంతం దగ్గరే వుంచుకున్నారు. ఆయన మరణానంతరం ఆ వాచ్‌ని న్యూయార్క్.లో వున్న ఒక మ్యూజియంలో పెట్టారు. అయితే 1987లో చేతివాటం వున్న ఒక దొంగ ఆ వాచ్‌ని కొట్టేశాడు. ఆ వాచ్‌కోసం అమెరికా పోలీసులు చాలా సంవత్సరాలు వెతికారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసు క్లోజ్ చేశారు. అయితే, ఆ వాచ్‌ పోయిన 36 సంవత్సరాలకి, అంటే నాలుగు రోజుల క్రితం మళ్ళీ దొరికింది. ఈ వాచ్‌ని ఫ్లోరిడాలో వున్న ఒక ఆక్షన్ కేంద్రంలో ఆక్షన్ వేస్తున్నారన్న విషయం పోలీసులకు తెలిసింది. అంతే, ఎంతమాత్రం లేటు చేయకుండా అక్కడకి వెళ్ళి వాచ్‌ని స్వాధీనం చేసుకున్నారు. 1987 నుంచి చేతులు మారీ మారీ.. చివరికి ఆ వాచ్ ఇక్కడికొచ్చింది. ఇంతకీ ఆ వాచ్‌ని దొంగతనం చేసింది ఎవరో కనుక్కోవాలని పోలీసులు అనుకున్నారు. రివర్స్ ఇంజనీరింగ్ టైపులో ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ, నో యూజ్.. సర్లే, దొంగ దొరక్కపోతే దొరక్కపోయాడు.. కనీసం వాచ్ అయినా దొరికింది అని పోలీసులు హ్యాపీగా ఫీలయ్యారు. అప్పటి వరకూ ఈ పోయిన వాచీ కోసం వెతికీ వెతికీ పోలీసుల బుర్ర ఎంత వాచిపోయిందో!