దక్షిణాఫ్రికాపై భారత మహిళల ఘన విజయం

దక్షిణాఫ్రికాతో  చెన్నై వేదికగా జరిగిన ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ లో భారత్ పది వికెట్ల ఆథిక్యతతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో పలు రికార్డులు సృష్టించింది.  తొలి వికెట్ కు మంధానా, షఫాలి వర్మ సాధించిన 292 పరుగుల భాగస్వామ్యం భారత మహిళల క్రికెట్ లో రికార్డు భాగస్వామ్యం. ఇంతకు ముందు వీరిరువురి మధ్యా 162 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. అలాగే ఒకే ఇన్నింగ్స్ లో  సిక్సర్ల రికార్డును షఫాలీ వర్మ బ్రేక్ చేసింది. గతంలో ఒకే ఇన్నింగ్స్ లో రెండు సిక్సర్లతో తన పేరిట ఉన్న రికార్డును  ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టింది. ఇక వీరిరువురి భాగస్వామ్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకు ముందు పూనమ్ రౌత్ కామినీల పేరిట ఉణ్న 275 పరుగుల భాగస్వామ్య రికార్డును వీరు బ్రేక్ చేశారు. 

ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. షఫాలి వర్మ 23 ఫోర్లు, 8 సిక్సర్లలో 205 పరుగులు చేసి రనౌట్ కాగా, మరో ఓపెనర్ స్మృతి మంధాన 27 ఫోర్లు, ఒక సిక్సర్ తో 149 పరుగులు చేసింది.

ఇంకా జాస్మిన్ రోడ్రిగ్యూస్ 55 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 69, రిచా ఘోష్ 86 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా 266 పరుగులు చేసి ఫాలౌన్ ఆడింది. ఫాలోన్ లో 377 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.