ఐసిస్ లక్ష్యంగా నైజీరియాలో యూఎస్ భీకర దాడులు

 

గత కొంత కాలంగా ఇజ్రాయెల్-పాలస్తీనా, ఉక్రెయిన్ - రష్యా, ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఐసీస్ టెర్రరిస్టులపై అటాక్ చేసింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరకా భారీగా దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంాఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

తాజాగా  ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని సొకోటో రాష్ట్రంలో ఐసీస్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమాయక క్రైస్తవులపై మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులపై చర్య తీసుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో పోస్ట్ చేశారు. నైజీరియాలో క్రైస్తవ మతం అస్తిత్వానికి ముప్పు ఉందని ట్రంప్ అన్నారు. 

పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు హింస కొనసాగిస్తున్నారని చెప్పారు. అలా చేస్తే భవిష్యత్ లో నరకం అనుభవించాల్సి వస్తుందని ఐసిస్ ని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. మా యుద్ద వీరులు అద్భుతంగా తమ వ్యూహాలను అమలు పరిచారు. అది కేవలం యునైటెడ్ స్టేట్స్ మాత్రమే చేయగలదు. నా నాయకత్వంలో అమెరికా రాడికల్ ఇస్తామిక్ ఉగ్రవాదాన్ని పెరగనివ్వదు.

క్రైస్తవులపై దాడులు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటా. చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అంటూ ట్రంప్ స్పందించారు. కాగా, ఈ దాడులను యూఎస్ ఆఫ్రికా కమాండ్ ధృవీకరించింది. కాకపోతే ఎంతమంది చనిపోయారన్న విషయం వెల్లడించలేదు. ఇటీవల క్రైస్తవులపై ఐసీస్ దారుణంగా దాడులు చేసింది. మారణహోమం సృష్టించి వేల మందిని హతమార్చింది. ఈ క్రమంలోనే నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు ఐసిస్ పై దాడి జరిగినట్లు యూఎస్ మిలిటరీ ఆఫ్రికా కమాండ్ తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu