బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో అగంతకుడి హల్ చల్.. దొంగేనా?
posted on Mar 17, 2025 12:14PM

బీజేపీ ఎంపీ, మాజీ మంతరి డీకే అరుఏణ ఇంట్లోకి అగంతకుడు జొరబడటం ఇప్పుడు సంచలనం సృష్టించింది. మామూలుగా ఇళ్లల్లో దొంగలు పడటం, పోలీసులకు ఫిర్యుదు అందగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం మామూలు విషయమే. కానీ ప్రజాప్రతినిథి నివాసంలోకి, అదీ ఎంపీ, మాజీ మంత్రి డీకే అరుణ నివాసంలోకి సోమవారం అర్ధరాత్రి (మార్చి 16) అగంతకుడు జొరబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చోరీ కోసం వచ్చిన ఆ అగంతకుడు దాదాపు గంటన్నర పాటు డీకే అరుణ నివాసంలోనే తచ్చాడాడు.
అంతే కాకుండా డీకే అరుణ నివాసంలోని సీసీ కెమోరా వైర్ ను కూడా తొలగించాడు. దీనిపై డీకే అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ అగంతకుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. తన ఇంట్లోకి అగంతకుడుజొరబడటం వెనుక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తనకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ఎంపీ డీకే అరుణతో ఫోన్ లో మాట్లాడి.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను ఆదేశించారు.