తింటే టీఆర్ఎస్ ప్లీనరీలోనే తినాలి.. 34 వంటకాలతో ధూంధాం మెనూ..
posted on Apr 26, 2022 5:08PM
తెలంగాణ ఫుడ్.. సంథింగ్ డిఫరెంట్. కొంతం కారం.. కొంచెం ఘాటుగా ఉంటుంది. వెరైటీ వెరైటీ వంటకాలు ఉంటాయి. పేర్లు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఇక తెలంగాణ కోసమే ఏర్పడిన పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్.. తన ప్లీనరీలో తెలంగాణ వంటకాలను ఏరికోరి వండిస్తుంటుంది. ఏటేటా మెనూలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. మెయిన్ వంటాకాలు మాత్రం సేమ్ ఉంటాయి. తాజాగా, హైటెక్స్‌లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ కోసం 34 ఫుడ్ ఐటమ్స్‌తో ప్రత్యేక వంటకాలు రెడీ చేస్తున్నారు. సుమారు 10వేల మందికి సరిపోయేలా భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు. నాన్‌వెజ్ లేనిదే తెలంగాణవాసులకు ముద్ద దిగదు. అందుకే, అందులో మాగ్జిమమ్ నాన్‌వెజ్ ఐటమ్సే. వెజ్ వంటకాలతో పాటు స్నాక్స్, స్వీట్స్ కూడా ఉన్నాయి. మెనూ చూస్తేనే నోరూరేలా ఉంది.
టీఆర్ఎస్ ప్లీనరీ ఫుడ్ మెనూ ఇదే...
1. చికెన్ ధమ్ బిర్యానీ
2. బగారా రైస్
3. వైట్ రైస్
4. తెలంగాణ నాటు కోడి కూర
5. మటన్ కర్రీ
6. తలకాయ కూర
7. బోటీ దాల్చా
8. ధమ్ కా చికెన్
9. రుమాలీ రోటీ
10. కోడిగుడ్డు పులుసు
11. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ
12. మామిడికాయ పప్పు
13. గుత్తి వంకాయ కూర
14. టమోటా కర్రీ
15. పచ్చి పులుసు
16. పప్పుచారు-అప్పడం
17. ఉలవచారు
18. టమాటా రసం
19. దొండకాయ, కాజు ఫ్రై
20. కొత్తిమీర తొక్కు
21. మామిడికాయ తొక్కు
22. వెల్లుల్లి కారం
23. చామగడ్డ పులుసు
24. ములక్కాడ పులుసు
25. ఆనియన్ రైతా
26. మిర్చీ బజ్జీ
27. గులాబ్ జామూన్
28. డబుల్ కా మీఠా
29. మిర్చీ గసాలు
30. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్
31. పెరుగు
32. మజ్జిగ
33. ఫ్రూట్స్
34. అంబలి