ఉద్యోగులకు సంక్రాతి కానుక!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా రెండు డీఏలను ప్రకటించనుంది. గురువారం (జనవరి 2)వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశాలుగా భావిస్తున్న   పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా చర్చించి  నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే ఉగాది నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సీఎం దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన రంజాన్, సంక్రాంతి, క్రిస్ మస్ కానుకలను తిరిగి ప్రారంభించే విషయంపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.  ఇక ఉద్యోగులకు కూడా సంక్రాంతి కానుకగా రెండు డిఏలను ప్రకటించే విషయంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.  అలాగే పేరివిజన్ కమిషన్, ఇంటీరియమ్ రిలీఫ్ లపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.