నేను అసైన్డ్ భూములను కొనలేదు...


నిన్న కె.కె. ఈరోజు డీఎస్. తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నేతలు ఒకరు తరువాత ఒకరు వరుసగా భూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కె.కె కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఆయన తాను ఎలాంటి ప్రభుత్వ భూములను కొనలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డీఎస్ కూడా అదే చెపుతున్నారు. తాను ఎలాంటి అసైన్డ్ భూములను కొనలేదని... తనపై కొందరు లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ...భూమి రికార్డులను పలుమార్లు తనిఖీ చేసిన తర్వాతనే తాను ఆ భూములను కొన్నానని... తాను కొన్న భూమి అంతకు ముందే పలుమార్లు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పారు. చాలా మంది చేతులు మారిన తర్వాతనే తాను ఆ భూమిని కొన్నానని ఆయన స్పష్టం చేశారు. 60 ఏళ్ల డాక్యుమెంట్లను పరిశీలించామని... అందులో ఎక్కడా అసైన్డ్ ల్యాండ్ అనే విషయం లేదని చెప్పారు. కాగా మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలో గౌడవెల్లి-రాయిలాపూర్ రోడ్డులో 8.9 ఎకరాల భూమిని.. నిరుపేదల కోసం ఇచ్చిన అసైన్డ్ భూమిని అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu