రాష్ట్రపతి అభ్యర్ధిగా సుష్మా స్వరాజ్...?

 

త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఎన్డీయే తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. కానీ చాలామంది పేర్లే చర్చలోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది. అధికార ఎన్డీయే అభ్యర్థిగా విదేశీ వ్యవహారాల మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలతో కూడి త్రిసభ్య కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కాగా 65ఏళ్ల సుష్మాస్వరాజ్ విదేశీ వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఢిల్లీ సీఎంగా కూడా పనిచేసిన ఆమె.. 25ఏళ్లకే మంత్రిగా పనిచేశారు. జనతా పార్టీలో కీలక సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. అంచెలంచెలుగా ఎదిగారు. న్యాయవాదిగా...రాజకీయ వేత్తగా పేరు సంపాదించుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu