కాంగ్రెస్ కు షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్..

 

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పార్టీ ఫిరాయింపులు జోరుగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. అసలే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే దానికి తోడు ఇప్పుడు త్రిపురలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాంరాం చెప్పారు. దీనికి సంబంధించి వారే ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని..  తృణమూల్ కాంగ్రెస్‌లో చేరుతున్నామని.. ప్రకటించారు. ఈమేరకు ఒక లేఖను స్పీకర్ రామేంద్ర కే నాథ్‌కు అందజేశారు. దీంతో త్రిపుర అసెంబ్లీలో తృణమూల్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది.