ప్రాణాలు తీసిన ఎన్నికల విధులు!

ఎన్నికల విధులు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. కావలి నియోజకవర్గంలోని సైదాపురం గ్రామానికి చెందిన బి.సుభాషిణి (55) అనే మహిళ అంగన్‌వాడీ ఆయాగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కావలిలో ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వుంది. దాంతో ఆమె తన కుమారుడు విజయ్ (19)తో కలసి కావలికి బయల్దేరారు. కావలి పట్టణంలో రైల్వే ట్రాక్‌ని దాటుతూ వుండగా ఆమెను రైలు ఢీకొంది. తల్లిని కాపాడే ప్రయత్నం చేసిన ఆమె కుమారుడిని కూడా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీకుమారులు ఇద్దరూ మరణించారు.