తిరుమలలో భారీగా భక్తజన సందోహం

tirumala tirupati, Tirupati Devasthanams, Tirumala Venkateswara Temple, TTD తిరుమల భక్తజన సందోహం పెరగడంతో పిల్లలు, పెద్దలు క్యూలైన్లలో అగచాట్లు పడుతున్నారు.ఇటీవలే పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడటం కలిసి తిరుమలకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తుల తాకిడి ఎక్కువైంది. శుక్ర, శనివారం రోజుల్లో సుమారు లక్షన్నర మంది తిరుమలేశుని దర్శించుకునే అవకాశముందని అధికారుల అంచనా. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు గాయపడ్డారు. కొందరు స్పృహ కోల్పోయారు. వారిని చికిత్స నిమిత్తం అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. భక్తులకు సరియైన వసతులు ఏర్పాట్లు చేయడంలో తితిదే విఫలమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu