తిరుమల లడ్డూ ఎఫెక్ట్.. ప్రసాదాల తయారీకి నందినీ నెయ్యే వాడాలి.. కర్నాటక సర్కార్ ఆదేశాలు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి  వినియోగం ఎఫెక్ట్ తో కర్నాటక సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రసాదం తయారీకి నందిని నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.   తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు అవశేషాలు వెలుగుచూశాయని, నాణ్యత తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంతో కర్ణాటక తాజా ఆదేశాలిచ్చింది.

ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం తిరుమల లడ్డూ వివాదంతో అలర్ట్ అయ్యింది.   తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన  ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీలో తమిళనాడు ఫుడ్ సేప్టీ అధికారులు విస్తృతంగా తనీఖీలు నిర్వహించారు. దిండిగల్ లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్‌ సేకరిం సేకరించి ల్యాబ్‌కు పంపారు.  అధికారులు.  

పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు చెబుతున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.

కాగా టీటీడీ నెయ్యి వివాదంపై   ఏఆర్ డెయిరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డెయిరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది.