కొండాసురేఖపై పరువు నష్టం కేసు నవంబర్ 13కి వాయిదా
posted on Oct 30, 2024 10:42AM
మంత్రి కొండాసురేఖపై పరువు నష్టం దావావేసిన నేపథ్యంలో బుధవారం(అక్టోబర్ 30) నాంపల్లి కోర్టులో విచారణకు రాలేదు.అయితే కెటీఆర్ తన వద్ద ఉన్న ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ కేసు నవంబర్ 13కి వాయిదా పడింది. మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో విచారణ వాయిదాపడింది. నాగార్జున కుటుంబంపై కొండాసురేఖ స్టేట్ మెంట్ తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉందని మాజీ మంత్రి కెటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన నాంపల్లి కోర్టు కెటీఆర్ తో బాటు బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ రికార్డు చేసింది . మిగతా సాక్ష్యుల స్టేట్ మెంట్ ను కోర్టు ఇవ్వాళ రికార్డు చేసింది. ఈ కేసుకు సంబంధించి 23 ఆధారాలను కెటీఆర్ న్యాయస్థానానికి సమర్పించారు. కొండాసురేఖ కూడా తన వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఆమె స్టేట్ మెంట్ కోర్టు రికార్డు చేసింది.