వట్టినాగులపల్లి లో నాగ చైతన్య.. సమంత ఎక్కడ!

నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(naga chaitanya) అస్సలు తగ్గేదేలే అని అంటున్నాడు.అభిమానులని రంజింప చేసే విషయం లో నో కాంప్రమైజ్ అంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ విషయం ఏంటో పూర్తిగా చూద్దాం.

చై అప్ కమింగ్ మూవీ తండేల్(thandel)ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో  గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఇక  రీసెంట్ గా  శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. దీంతో షూటింగ్ కి   చై  కొన్ని రోజులు   బ్రేక్ ఇస్తాడేమో  అని అందరు అనుకున్నారు. కానీ చై మాత్రం షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా  చేస్తున్నాడు. ప్రస్తుతం తండేల్ షూటింగ్  వట్టి నాగులపల్లి లో  జరుగుతుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, రాజేంద్ర నగర్ తాలూకా లో వట్టినాగులపల్లి ఉంది. కథకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని అక్కడ చిత్రీకరిస్తున్నారు. చిత్ర తారాగణం మొత్తం అందులో  పాల్గొంటుంది. 

ఇక తండేల్ పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫిలిం సర్కిల్స్ లో కూడా తండేల్ పై  పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇందుకు కారణం , హిట్ చిత్రాల బ్యానర్  గీత ఆర్ట్స్ నిర్మిస్తుండగా  కార్తికేయ 2 తో పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్న చందు మొండేటి(chandu mondeti)దర్శకత్వం వహిస్తుండటం.  ఇక హీరోయిన్ గా  సాయి పల్లవి(sai pallavi)ఉండనే ఉంది. సోషల్ మీడియా లో అయితే చై వట్టి నాగుల పల్లి లో షూటింగ్ చేస్తుంటే సమంత ఎక్కడ షూట్ లో ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.