సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న టోవినో థామస్ 'ఏఆర్ఎమ్'

మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas) హీరోగా జితిన్ లాల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అజయంతే రాండమ్ మోషణం' (ARM) . ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకొంది. అంతే కాకుండా కేవలం నాలుగు రోజుల్లో 35 కోట్లు కలెక్ట్ చేసి సంచలన సృష్టించింది.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు.

డిబు నైనన్ థామస్ ఈ సినిమాను సంగీతం అందించారు. టోవినో థామస్, కృతి శెట్టి కెమెస్ట్రీ బాగా సెట్ అయ్యింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ ఒక కఠినమైన అవతార్‌ను ప్రదర్శించడం చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. 

తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ విజువల్ వండర్ గా ఉందని సినిమా ప్రేక్షకులు, ఫాన్స్ అంటున్నారు.