ఏపీలో మళ్లీ టెన్త్ పేపర్ లీక్!.. గొల్లుమంటున్న స్టూడెంట్స్..
posted on Apr 28, 2022 4:36PM
ఏపీలో టెన్త్ ఎగ్జామ్ పేపర్ మళ్లీ లీక్ అయింది. తొలిరోజు తెలుగు పేపర్ లీక్ అవగా.. అది లీక్ కాదని.. మాస్ కాపీ అంటూ సర్కారు ఇష్యూని డైల్యూట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ, రెండోరోజు మళ్లీ ఎగ్జామ్ పేపర్ లీక్. ఈసారి సబ్జెట్ మారింది. అంతే తేడా. లీక్ లీకే.
ఏపీలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ పర్వం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ కలకలం రేపింది. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా, గురువారం హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వరుసగా పదో తరగతి ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతుండడంతో కష్టపడి చదివిన విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి బొత్స సత్యానారాయణ ఏం చేస్తున్నారని.. దీనిపై సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. లీక్‌లపై పేరెంట్స్ మండిపడుతున్నారు. పరీక్షలే సరిగ్గా నిర్వహించలేని జగనన్న.. ఇక విద్యా వ్యవస్థను ఏం ఉద్దరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.