కేసీఆర్ పాలనను గాలికొదిలేశారు

 

ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షనేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష నాయకులు వరుసపెట్టి కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తానని మాటలైతే చెప్పారు కాని చేతలు మాత్రం నిల్లని విమర్శిస్తున్నారు. అసలు ఆయన సచివాలయానికే వెళ్లనిది పాలన ఎక్కడ నుండి చేస్తారని.. పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. మరోవైపు అధికారంలోకి రావడానికి హామీల హామీల మీద ఇచ్చారని.. ఇప్పుడు సరిగా ఒక్కటి కూడా నెరవేర్చట్లేదని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది పైన అవుతున్నా ఇంత వరకూ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఎద్దేవ చేశారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కారని మండిపడ్డారు. కెసిఆర్ అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చాక మరో మాట చెబుతున్నారన్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తీర్చాలంటే ఇంకో 25 ఏళ్లు పడుతుందని.. ప్రస్తుతం తెలంగాణ ఖజానా ఖాళీ అయింది ఇంక ఎలా హామీలన్నీ తీర్చుతారని.. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు.