భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ!
posted on Jul 8, 2024 12:36PM
తెలంగాణ ప్రభుత్వంఒకే సారి 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కాణంగా నిలిపివేసిన జీవోను తెలంగాణ ప్రభుత్వం సోమవారం (జులై 8) విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైనవారు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. రేవంత్ సర్కార్ తాజాగా నియమించిన కార్పొరేషన్ల చైర్మన్ల జాబితా ఇలా ఉంది.
హౌసింగ్ కార్పొరేషన్ - ఆర్. గురునాథ్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ - కాల్ప సుజాత, గ్రంథాలయ పరిషత్ - ఎండీ రియాజ్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ - పోడెం వీరయ్య, స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ - ఎన్. గిరిధర్ రెడ్డి, మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్ - జనక్ ప్రసాద్.
ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. విజయబాబు, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ - చల్లా నరసింహారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కె. నరేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - ఇ. వెంకట్రామిరెడ్డి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ - నాయుడు సత్యనారాయణ, మైనారిటీస్ కార్పొరేషన్ - ఎం.ఏ. జబ్బార్, రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - రాంరెడ్డి మల్ రెడ్డి, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - అనిల్ ఎరావత్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ - ఐతా ప్రకాశ్ రెడ్డి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ - నిర్మల జగ్గారెడ్డి (జగ్గారెడ్డి సతీమణి).
బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - నూతి శ్రీకాంత్, రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్ - మన్నె సతీశ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ - ఎన్. ప్రీతమ్, షెడ్యూల్డ్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బెల్లయ్య నాయక్, గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కె. తిరుపతి, మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - జె. జైపాల్, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ - పటేల్ రమేశ్ రెడ్డి, ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బంద్రు శోభారాణి, ఫుడ్ కార్పొరేషన్ - ఎం.ఏ. ఫహీం, సంగీత నాట్య అకాడెమీ - అలేఖ్య పుంజల, తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ - కె. శివసేనా రెడ్డి, వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. వీరయ్య, విత్తనాల అభివృద్ధి సంస్థ - ఎస్. అన్వేష్ రెడ్డి, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ - కాసుల బాలరాజు, కోఆపరేటివ్ యూనియన్ - మనాల మోహన్ రెడ్డి, ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ - జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల ఛైర్మన్ - జంగా రాఘవరెడ్డి, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ - రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర మత్స్య సహకార సంఘం ఛైర్మన్ - మెట్టు సాయి కుమార్.