తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్!

బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఏపీలోని తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, వైఎస్ఆర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.అలాగే తెలంగాణలో  హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో  భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.