హీరో చంపిన వ్యక్తి దయ్యంలా మారాడా?
posted on Oct 5, 2024 3:25PM
రేణుకాస్వామి అనే తన అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ కొంతకాలంగా విచారణ ఖైదీగా బళ్లారి జైలులో వున్నారు. దర్శన్ గత కొన్నిరోజులుగా రాత్రుళ్ళు నిద్రపోవడం లేదని తెలుస్తోంది. తాను చంపిన రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని, అందువల్ల భయంతో తనకు నిద్ర పట్టడం లేదని దర్శన్ జైలు అధికారులకు చెబుతున్నారని తెలుస్తోంది. తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, అందువల్ల తనను బెంగళూరు జైలుకి తరలించాలని కోరినట్టు సమాచారం. అర్ధరాత్రి సమయంలో దర్శన్ గట్టిగా కేకలు వేస్తున్నాడని తోటి ఖైదీలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా దర్శన్ ఆడుతున్న నాటకమని కొందరు అంటున్నారు. బెంగళూరు జైలుకు మారడం కోసమే దర్శన్ ఇవన్నీ చెబుతున్నారని అంటున్నారు. ఒకవేళ రేణుకాస్వామి దయ్యంగా మారినట్టయితే బెంగళూరు జైలుకు రాడా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.