టీ కాంగ్రెస్ నేతలను కాకా పడుతున్న జూపల్లి
posted on May 30, 2011 11:55AM
మహబూబ్
నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల శానసభా నియోజకవర్గంలో మంత్రి జూపల్లి పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఉదయం అల్పాహార విందు నిచ్చారు. ఈ విందుకు ఎంపీలు వివేక్, మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్ తదితరులు పాల్గొన్నారు. తన నియోజకవర్గం గద్వాలలో జూపల్లి కృష్ణారావు పాదయాత్రను మరో మంత్రి డికె అరుణ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ అల్పాహార విందు జరిగింది. డికె అరుణ వ్యతిరేకతతో జూపల్లి కృష్ణారావు తన పాదయాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆయన తన పాదయాత్రను గద్వాలలో చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల మద్దతును ఆయన కూడగట్టుకుంటున్నారు. జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమర్థిస్తున్నారు. కాంగ్రెసు విధానం మేరకే జూపల్లి కృష్ణారావు పాదయాత్ర జరుగుతోందని మందా జగన్నాథం అన్నారు.