వర్మకు తిప్పలు తప్పేట్టు లేవు
posted on May 30, 2011 12:41PM
విజ
యవాడ: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు బెజవాడ రౌడీలు చిత్రంతో తిప్పలు తప్పేట్టు లేవు. నాగచైతన్య ప్రధాన పాత్ర పోషిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం పేరును మార్చాల్సిందేనని విజయవాడ వాసులు దర్శకుడు రాంగోపాల్ వర్మను డిమాండ్ చేస్తూ నగరంలో పలువురు నిరాహారదీక్షకు దిగారు. ప్రశాంతతకు మారు పేరైన విజయవాడను వివాదాస్పద నగరంగా మార్చే ప్రయత్నాలు వర్మ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వర్మ పేరు మార్చే వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తి లేదని వారు చెబుతున్నారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని, వర్మపై క్రిమినల్ కేసు పెడతామని చెప్పారు. బెజవాడ రౌడీలు పేరు తీసేసి బెజవాడ గాంధీ అని పేరు పెట్టుకోవచ్చునని వారు వర్మను డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్మకు సన్నిహితుడు అయిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకు వెళ్లామని వారు చెప్పారు.