సోంపేటలో ఉద్రిక్తత

శ్రీకాకుళం : ధర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జిల్లాలోని సోంపేటలో సోమవారం బంద్ కొనసాగుతోంది. మంత్రి ధర్మాన పర్యటనను అడ్డుకునేందుకు బోరగాం జంక్షన్‌లో పర్యావరణ పరిరక్షణ సమితి రాస్తారోకో నిర్వహించగా పోలీసులు సమితి కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఆందోళనకారులు ఓ గూడ్స్ రైలును సైతం నిలిపివేశారు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ధర్మాన ఈరోజు కంచిలి, ఇచ్చాపురంలలో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క సోంపేటలో పరిస్థితుల అధ్యయనంతోపాటు ఉత్తరాంధ్రలోని మైనింగ్, పోర్టులు, సెజ్ ల ప్రాంతాల్లో పర్యటించడానికి వీహెచ్ బృందం విశాఖనుంచీ బయలుదేరింది. మూడురోజులపాటు ఈ అధ్యయనం కొనసాగుతుందని, తమ యాత్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వీహెచ్ అన్నారు. మైనింగ్ సంపద కొందరి చేతుల్లోనే ఉంటోందని, అందుకే దానిపై అధ్యయనం చేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఎమ్మెల్యే సాయిరాజు తండ్రి రామరాజు, భార్య విజయ సహా పలువురిని అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా సోంపేటలో మంత్రుల పర్యటనను అడ్డుకోవద్దని డీఎస్పీ గ్రామస్తులకు సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu