కోదండరాం ఆశ నిరాశే

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ తన మహానాడు ఉత్సవంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తీర్మానం చేస్తుందని ఆశించామని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆదివారం న్యూఢిల్లీలో ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. అయితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణకు మహానాడులో టిడిపి తీర్మానం చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి తీర్మానం వల్ల ఒరిగేదేమీ లేక పోయినా ఆ పార్టీ విధానం స్పష్టమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణపై టిడిపి ఖచ్చితమైన వైఖరి వెల్లడించి ఉంటే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu