తెలుగుదేశం సభ్యత్వ నమోదు ప్రారంభం

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారి పెన్ను, పేపర్ లేకుండా ‘ఇ’ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పూర్తి సాంకేతిక హంగులతో నిర్వహిస్తోంది. కాగిత రహిత సభ్యత్వ నమోదు చేస్తోంది. ఎన్టీఆర్ భవన్’లో చంద్రబాబు మొదటి సభ్యత్వాన్ని ఐ పాడ్ ద్వారా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.