టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు: బాబు

 

చరిత్ర ఉన్నంతవరకూ టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన రెండేళ్ళకోసారి జరిగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘తెలుగుదేశం పార్టీ దేశంలోనే వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమర్థులైన నాయకులుగా తీర్చిదిద్దుతాం. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి వుంది. ఎవరైనా కార్యకర్తలు అనుకోకుండా చనిపోతే వారి పిల్లలను చదివించే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటోంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే సేవా కార్యక్రమాలకు మారుపేరు’’ అన్నారు.