నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి మృతి

 

Tamma Reddy Krishna Murthy, Tamma Reddy Krishna Murthy died, Tamma Reddy Krishna Murthy passed away, Tamma Reddy Krishna Murth no more

 

 

ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి గోపాల కృష్ణమూర్తి ఈరోజు కన్నుమూశారు. 2007లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. బంగారుగాజులు, దత్తపుత్రుడు, లక్షాధికారి, జమిందార్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు, తమిళంలలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశారు. కృష్ణమూర్తి కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, చినపాలమర్రులో 1920 అక్టోబరు నాలుగో తేదీన జన్మించారు.ఆయనకు ఇద్దరు కుమారులు- లెనిన్‌బాబు, భరద్వాజ. కృష్ణమూర్తి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.