రజనీపై మళ్లీ రెచ్చిపోయిన స్వామి...
posted on Jun 27, 2017 10:46AM
.jpg)
తమిళనాడు సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడైతే వార్తలు బయటకు వచ్చాయో అప్పటినుండి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. రజనీ పై కామెంట్లు విసురుతూనే ఉన్నాడు. రజనీ కాంత్ రాజకీయాలకు పనికిరాడని.. ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని..ఇలా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన మాటల యుద్దం మాత్రం అప్పుడే ఆగేలా కనిపించడంలేదు. మరోసారి స్వామి రజనీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోని శంకరమఠం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నుంచి సుబ్రహ్మణ్యస్వామి అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రజనీకాంత్ ఇక రాజకీయాల్లోకి రాబోరని.. ఇకపై రజనీని ప్రధాని నరేంద్రమోదీ కలువబోరని స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా.. రజనీకాంత్ ఆర్థిక నేరగాడు అంటూ.. ఆ ఆర్థికనేరాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయనే బాంబును సైతం పేల్చారు.