ఆస్తి రాయలేదని..అత్తను కోడలు ఏం చేసిందో తెలుసా..?
posted on Jun 26, 2017 7:04PM
.jpg)
ఆస్తులు రాయని అత్తమామల్ని కోడళ్లు ఎంత హీనంగా చూస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. కనీసం తినడానికి తిండి పెట్టకుండా..జీవితాన్ని దుర్భరం చేస్తారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక కోడలు మాత్రం ఆస్తి తన పేరు మీద రాసివ్వలేదన్న కోపంతో అత్తను టెర్రస్ మీద నుంచి తోసేసింది. వివరాల్లోకి వెలితే ఇటా జిల్లాకు చెందిన ఊర్మిళా దేవి తన అత్త ప్రేమ్ దేవిని గత కొంతకాలంగా ఆస్తి తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేస్తోంది. అయితే ఎంతకు తన మాట నెగ్గకపోవడంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అత్త అడ్డు తొలగించుకుంటే ఆస్తి తన పేరు మీదకు వస్తుందని ఒక పన్నాగం పన్నింది. తన భర్త ఇంట్లో లేని సమయం చూసుకుని ఊర్మిళ తన అత్తను టెర్రస్ మీద నుంచి కిందకి తోసేసింది..ఇది గమనించిన ప్రేమ్‌దేవి చిన్న కుమారుడు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఊర్మిళదేవిని అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
.jpg)