మోడీకి ట్రంప్ ఘన స్వాగతం....

 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, ఇంకా ఇవాంక ట్రంప్ మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అనంతరం కేబినెట్‌ రూమ్‌లో ట్రంప్‌- మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. శ్వేతసౌధంలో తనకు లభించిన ఆతిథ్యం భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తానని అన్నారు. అమెరికాతో స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇరు దేశాలు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్థిక శక్తులన్నారు. పరస్పర సహకారంపై చర్చించామన్నారు. ఇంకా ఉగ్రవాదం గురించి ఆయన మాట్లాడుతూ... ‘ఉగ్రవాదం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో సంయుక్త పోరాటం చేస్తాము. ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని అణచివేస్తామని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా మోదీ ట్రంప్‌ను భారత్‌కు ఆహ్వానించారు. అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ ‘ భారత్‌ మాకు అత్యంత సన్నిహిత దేశం... అత్యున్నత సంప్రదాయాలు, ఆచారాలు కలిగిన దేశం... అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం... ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలానే కొనసాగుతాయని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu