తలసాని తల్లి మదర్ సెంటిమెంట్
posted on Dec 16, 2014 9:39AM

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మంత్రి పదవి కోసమే తలసాని పార్టీ మారారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినంతమాత్రాన తనకు వచ్చిన అప్రతిష్ట తొలగిపోయేది కాదు. మంగళవారం నాడు తాను అనుకున్నది సాధిస్తూ మంత్రి పదవి చేపట్టబోతున్నారు. అయితే ఈ సందర్భంలో తలసాని తల్లి లలితాబాయి ‘మదర్ సెంటిమెంట్’తో మాట్లాడటం విశేషం. తలసానికి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిపదవి దక్కడం సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె చెబుతూనే, చంద్రబాబు నాయుడికి తలసాని దూరం కావడం బాధ కలిగిస్తోందని అన్నారు. తలసాని తనకు చిన్నకొడుకని, చంద్రబాబు నాయుడు తనకు పెద్ద కొడుకని ఆమె మంచి సెంటిమెంట్ డైలాగ్ కూడా ఆమె ఉపయోగించారు. పాపం ఈమెకు సెంటిమెంట్లు ఉన్నట్టున్నాయిగానీ, తలసానికి అవేవీ లేవని తెలుస్తూనే వుంది.