రాష్ట్రపతి గుండె నాళాలు పూడుకుపోయాయి....
posted on Dec 16, 2014 9:12AM

అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్ది రోజుల క్రితం ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుండె నాళాలు పూడుకుపోయినట్టు తెలుస్తోంది. దాంతో ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి గుండెలో స్టెంట్ అమర్చారు. ఆపరేషన్ పూర్తి అయిన అనంతరం ప్రణబ్ ముఖర్జీ కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. ఆయన ఉల్లాసంగా వున్నారని, ఆయన ఆరోగ్యం పుంజుకుంటోందని వారు వెల్లడించారు. మంగళవారం నాడు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీక్షించిన అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసే విషయంలో వైద్యులు నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రణబ్ ముఖర్జీకి ధూమపానం అలవాటు గతంలో వుండేది. ఆయన గతంలో బహిరంగంగానే పైప్ కాల్చేవారు. ఇప్పుడు ఆయన బహిరంగంగా పైప్‌తో కనిపించడం లేదు.