అమరావతిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
posted on Jan 11, 2026 3:12PM
.webp)
రాజధాని అమరావతిపై మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు అందరం కలిసి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో మాజీ రాష్ట్రపతి పాల్గొన్నారు. అమరావతి అంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, తాడికొండలు మాత్రమే కాదు...ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతి రూపం అన్నారు. రాజధాని విషయంలో సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. ఈ విషయంలో అనవసర వివాదాలను సృష్టించొద్దని తెలిపారు.
పాలిటిక్స్‌లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అందువల్లే రాజకీయాల్లోకి తన కుమారుడు, కుమార్తెను రానివ్వలేదని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రాదాయాలను కాపాడాలని తన పిల్లలకు చెప్పానని, అదే తాను ఇచ్చే సంపద అని వెంకయ్య నాయుడు అన్నారు. ఏది మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మూలలు మారకూడదని మాజీ ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండగ నిర్వహించుకుంటామని, ఈ మధ్య వాతవరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతితోనే మన పండగలన్నీ ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతి బాగుంటేనే భవిష్యత్ సైతం బాగుంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లా అమరావతి కూడా అభివృద్ధి చెందాలని తెలిపారు.