గాదె ఇన్నయ్య నివాసం, ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు

మావోయిస్టులతో సంబంధాలు, వారికి సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేసిన సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, ఆయన నిర్వహిస్తున్న మా ఇల్లు ఆశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మంగళవారం (జనవరి 13) సోదాలు నిర్వహించారు.  కుషాయిగూడ పరిధిలోని చక్రిపురంలోని  సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, జనగామలో ఆయన నిర్వహి స్తున్న అనాథాశ్రమంలో నిర్వహించిన తనిఖీలలో కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  మావోయిస్టులకు నిధుల సేకరణ, మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ మెంట్లు చేయడంతో పాటుగా ,  సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గాదె ఇన్నయ్యను కొంత కాలం కిందట ఎన్ఐఏ అరెస్టు చేసింది. 

ఇప్పుడు తాజాగా ఆయన నివాసాలలో సోదాలు నిర్వహించింది.  మంగళవారం (జనవరి 13) తెల్లవారు జామునే గాదె ఇన్నయ్య ఇంటిని చుట్టుముట్టి ఆయన  డైరీలు, ఫోన్ కాల్ డేటా, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పరిశీలించారు. ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఆశ్రమానికి వస్తున్న నిధుల మూలాలు ఏమిటి? అనే కోణంలో అధికారులు ఆరా తీశారు.  సోదాల అనంతరం కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్‌లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.    ఇలా ఉండగా గాదె ఇన్నయ్యను ఐదు రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది.  కోర్టు తీర్పు వెలువడక ముందే అధికారులు  సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu