వాయిదా పడిన శాసనసభ సమావేశాలు

 

బుధవారం శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కొంతసేపటికే వాయిదా పడ్డాయి. వ్యాట్ ను ఎత్తివేయాలని తెలుగుదేశం, కరెంట్ ఛార్జీలు, కోతలపై వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణా అంశంపై టి.ఆర్.ఎస్. డబ్బింగ్ సినిమాలు, టి.వి. సీరియళ్ళపై సిపీఐ, వృత్తిదారులకు ఉపప్రణాళిక పై సిపిఎం శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ కు వాయిదా తీర్మానాలను ఇచ్చారు. అయితే వాటిని సభాపతి తిరస్కరించడంతో విపక్షాలు సభాపతి పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ గంటపాటు సభను వాయిదా వేశారు.