వాణి, వీణ తలలు విభజింపబడి వందేళ్లు వర్ధిల్లాలి
posted on Oct 16, 2012 6:02PM
.png)
(ఆపరేషన్ చేసి విడదీయండి లేదామెర్సీ కిల్లింగ్ కి అనుమతించండి అంటూ వాణివీణ తల్లి దండ్రులు ప్రభుత్వానికి పెట్టిన అర్జీ కి స్పందిస్తూ).
ఎక్కడ అవిభక్తల శస్త్ర చికిత్స జరిగినా మనకు వెంటనే గుర్తు వచ్చే వాణి వీణ సోమవారం పదవ ఏట అడుగుపెట్టారు. వీరు మామూలు పిల్లల్లా నడువ లేరు, కూర్చోలేరు, పడుకోలేరు. కారణం అంగవైకల్యం కాదు వారి తలలు పుట్టుకతో కలసి ఉండటం వల్ల. వీరు పుట్టిన దగ్గరనుండి వీరికి హాస్ఫటలే లోకం. పేషంట్లు, డాక్టర్లు, నర్సులు, తప్ప మరోలోకం తెలియదు. మామూలు పిల్లల ప్రపంచం వీరి కసలు తెలియదు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వరంగల్ లో ఉన్న చిన్న గ్రామం. దాంతో వారు వీరిని కనిపెట్టుకొని చూడటం కుదరదని హాస్పిటల్లోనే ఉంచారు.మొదట గుంటూరు మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉండే హాస్పటల్ లో వీరు ఉండేవారు. తర్వాత హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి మార్చబడ్డారు. అదే హాస్పిటల్ చివరిలో ఉండే 18 చదదరపు మీటర్ల గదిలో వీరిద్దరూ షిప్టులువారీగా చూసే ముగ్గురు ఆయాలతో సంతోషంగానే ఉంటున్నారు. వీరికి తెలుగు, హిందీ, లెక్కలు, ఇంగ్లీషు చదవటం రాయడం నేర్చుకుంటున్నారు. వాణి ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది. అయితే వీణ మాత్రం డాక్టరు తను కావాలని అంటుంది. ప్రస్తుతానకి డాక్టర్ నరేంద్రకుమార్ వీరి ఖర్చులను భరిస్తున్నారు. చిన్నతనంలో వీరికి ఆపరేషన్ చేయటానికి సంసిధ్దత వ్యక్తం చేసిన అచార్యనాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ నాయుడమ్మకి అవిభక్త కవలలను ఆపరేషన్ చేసి విడదీయటంలో నైపుణ్యం వుంది. అయితే తలలు కలిసి ఉన్న వారు వారి ఆపరేషన్లలో లేదని ప్రభుత్వం ఆయన ప్రతిపాదనను త్రోసి పుచ్చింది. ఆతరువాత డాక్టర్ ఎన్ సికె రెడ్డి వారిని నీలోఫర్ హాస్పిటల్ చేర్చి వారికి ఆపరేషన్ కు కేస్ స్టడీ చేసే లోపే వారు ట్రాన్స్ ఫర్ అయ్యారు. చాలా మంది విదేశీ డాక్టర్లు వైద్యం సాయం అందించడానికి ముందుకొచ్చారు అయినా ఏ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇంకా వారు నరక యాతన అనుభవిస్తూనే ఉన్నారు. అందరూ పిల్లలానే వీరి తెలివితేటలు ఆటపాటలు బాగానే ఉన్నా మెదడుకు చెందిన ఒక రక్త నాళం ఇద్దరికీ కలిసే ఉండటంతో వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. దీనివల్ల ఎవరో ఒకరు లేదా ఇద్దరికీ ప్రాణాపాయం వుంటుందని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ డాక్టర్ డేవిడ్ ఆయన చెబుతున్న ప్రకారం ఇద్దరికీ కలసి ఒకటే రక్తం నాళం తలలో ఉండటం వల్ల చిన్న చిన్నగా సంవత్సరం పాటు ఈ పిల్లలిద్దరికీ ఆపరేషన్ చేయడం వల్ల కొత్తగా మరో రక్తనాళాన్ని అభివద్ది చెందిచవచ్చునని తద్వారా ఇద్దరినీ అపాయం నుండి తప్పించవచ్చునంటున్నారు. నీలోఫర్ డాక్టర్లలలో చాలా మంది మన దగ్గర అత్యాధునిక పరికరాలేవీ అందుబాటులో లేనందువల్ల వీరికి ప్రమాదం ఉంటుందంటున్నారు. అయితే ఎన్సికె రెడ్డి మాత్రం తన సహచరులతో కలసి ఆపరేషన్ కు సిద్దంగా ఉన్నానని అయితే సంబందిత మంత్రి, సీ ఎం అందుకు ఆమోదించ వలసి ఉందని తెలిపారు. వీరికి మంచి జీవితం ఇవ్వాలనే సంకల్ఫ సిద్ది ఉంటే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయి. దాంతో వీరిద్దరూ మామూలు ఫిల్లలకు మాదిరిగానే ఛదువుకోవచ్చు, మిగతా పిల్లలతో ఆడుకోనూ వచ్చు, అందుకే వాణి వీణ వందేళ్లు వర్దిల్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నేర్పరితనం, అనుభవం ఉన్న డాక్టర్లు ఈ ఆపరేషన్ను విజయవంతం చేయడం ద్వారా మరో వెయ్యేళ్లు భావితరాలకు దారిచూపుతూ మెడికల్ హిస్టరీలో నిలిచిపోవాలని కోరుకుంటూ తెలుగువన్.కం