గోపి కథకు పడిపోయిన రామ్

 

"మసాలా" వంటి యావరేజ్ సినిమా తర్వాత రామ్ హీరోగా త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనుంది. రచయిత గోపీ మోహన్ అందరికి సుపరిచితుడే. రామ్ కోసం గోపీ ఓ అదిరిపోయే కథ సిద్ధం చేసుకొని, రామ్ కు వినిపించాడంట. ఆ కథ రామ్ కి ఎంతగానో నచ్చడంతో గోపికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో గోపి బిజీగా ఉన్నాడని తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనే విషయం ఇంకా తెలియదు. మరి వరుస ఫ్లాపులతో ఉన్న రామ్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.