Showtime Review: షో టైమ్ వెబ్ సిరీస్ రివ్యూ

 

వెబ్ సిరీస్ : షో టైమ్
నటీనటులు:  ఇమ్రాన్ హష్మీ, మహిమ మాక్వానా, మౌనీ రాయ్, నసీరుద్దీన్ షా, రాజీవ్ ఖండేల్‌వాల్, శ్రీయ సరన్, విశాల్ వశిష్ట, బెనెడిక్ట్ గ్యారెట్, విజయ్ రాజ్ తదితరులు
ఎడిటింగ్: మనన్ అశ్విన్ మెహతా
మ్యూజిక్:  ఆనంద్ భాస్కర్
సినిమాటోగ్రఫీ: వివేక్ షా
 నిర్మాతలు: ఆనంద్ రైచురా, కరణ్ గుప్తా
దర్శకత్వం:  మనోహర్ వర్మ , మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్


ఇమ్రాన్ హష్మీ, శ్రీయా సరన్,  మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ' షో టైమ్ ( SHOWTIME).. ఈ ఏడాది మార్చిలో మొదటి సీజన్ లోని నాలుగు ఎపిసోడ్ లు రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మరో మూడు ఎపిసోడ్ లు రిలీజ్ చేశారు మేకర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం...

కథ :

విక్టరీ స్టూడియోస్ అధినేత విక్టర్ ఖన్నా (నసీరుద్దన్ షా). తన కుమారుడు రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మీ) స్టూడియోని చూసుకుంటాడు. విక్టర్ మనవరాలు మహిక నందీ ( మహిక మాక్వానా) సినీ క్రిటిక్. అయితే స్టూడియో తరఫున తీసే సినిమాలు, కథలపై తండ్రితో రఘు విబేధిస్తుంటాడు. అయితే తమ సినిమా.. ' లవ్ డేంజరస్ ' రిలీజ్ సమయంలో మంచి రేటింగ్ ఇవ్వాలని మహికను రఘు కోరుతాడు. కానీ ఆ సినిమాను మహిక ఏకి పారేస్తుంది. దాంతో వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతాయి. అయితే  తాత డ్రీమ్ ప్రాజెక్ట్ 1857 సినిమా నిర్మాణంలో రఘు, మహిక మధ్య ఘర్షణ భారీగా చోటుచేసుకొంటుంది. నటి మందిరా సింగ్ ( శ్రీయా సరన్) కు, అర్మాన్ సింగ్ కి మధ్య విభేదాలు వస్తాయి. అదే సమయంలో రఘు కన్నాకి, మౌని రాయ్ కి మధ్య లవ్ బ్రేకప్ అవుతుంది. అయితే అర్మాన్ సింగ్ చేస్తోన్న ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ రోజు ఆడియన్స్ కలుస్తాడు. అదే సమయంలో అతడిని కొందరు దుండగలు రాళ్ళతో కొట్టగా తను ఆ రాయిని తీసుకొని వారిపై విసిరేయగా అది నేషనల్ ఇష్యూ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల విక్టరీ స్టూడియోస్ తో చేస్తున్న సినిమా ఆగిపోవడంతో ప్రొడక్షన్స్ నుండి మహికా నందీకి డబ్బులు మొత్తం రిటర్న్ చేయమని వార్నింగ్ వస్తుంది. దాంతో‌ మహికా నందీకి వేరే ఆప్షన్ లేకుండా అయిపోతుంది. అదే సమయంలో సాజిన్ మొరార్కా నుండి మహికా నందీకి కాల్ వస్తుంది. తనకి సాయం చేస్తానని చెప్తాడు. అసలు సాజిన్ మొరార్కతో  రఘు ఖన్నాకి ఉన్న విభేధాలేంటి? మహిక నందీకి సాజిన్ ఎందుకు సాయం చేయాలనుకున్నాడు? చివరికి విక్టరీ స్టూడియోస్ లో ఏం జరిగిందనేది మిగతా కథ.

విశ్లేషణ:

షో టైమ్ సిరీస్ కి తగ్గట్టుగానే వెబ్ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ లో మొత్తంగా ఏడు ఎపిసోడ్ లు ఉండగా.. మొదటి నాలుగు ఎపిసోడ్‌లు ఈ ఏడాది మార్చి నెలలో రిలీజ్ చేయగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇక సస్పెన్స్ కి తెరతీస్తూ చివరి మూడు ఎపిసోడ్ లని రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి నాలుగు ఎపిసోడ్ లలో తండ్రి చేసే ప్రతీ సినిమాని దగ్గరుంటి చూసుకునే రఘు ఖన్నా చేసిన కొన్ని పనుల వల్ల విక్టరీ స్టూడియోస్ భాద్యతల్ని మహికా నందీకి అప్పగిస్తాడు ‌ అక్కడి నుండి కథ ఆసక్తిగా మారుతుంది.

సినిమా ప్రమోషన్స్ లలో నటీనటులు ప్రవర్తించే తీరుని బట్టి వారి జయాపజయాలు ఆధారపడి ఉంటాయనేది ఈ సిరీస్ ద్వారా మేకర్స్ చెప్పాలనుకున్నారు.. అంతే చక్కగా చెప్పేశారు. కథ ఎపిసోడ్ అయిదు ముప్పై నిమిషాలు ఉంటుంది. ఇందులో ఓ సినిమాలో చేస్తున్న యాక్టర్స్ వారి పర్సనల్ లైఫ్ లోని కొన్ని డిస్టబెన్స్ ల వల్ల ఫేయిల్యూర్ గా భాదపడుతుంటారుమ. అదే సమయంలో అది రిలీజ్ అయి హిట్ అవుతుందని ఎదురుచూస్తున్న మేకర్స్ కి వణుకు. అసలు ఆ సినినా రిలీజ్ అవుతుందా? లేదా మహికా నందీకి సాజిన్ ఎందుకు సాయం చేయాలనుకున్నాడనే పాయింట్ ఆసక్తిని పెంచేసింది‌.

రఘు ఖన్నా మాటలు కాస్త అసభ్యంగా అనిపించినప్పటికీ అవి ఆ సీన్ కి తగ్గట్టుగానే ఉంటాయి. అయితే మధ్యలో కొన్ని లిప్ లాక్ లు ఉంటాయి‌ కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకుంటే చాలు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో కథ ఆసక్తిగా సాగినప్పటికి ఎంగేజింగ్ సీన్లని ఆరు, ఏడు ఎపిసోడ్ లో ఉంచారు మేకర్స్‌ . చివరి ఎపిసోడ్ లో కథలో వచ్చే మలుపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

కొన్ని సందర్భాలలో మన శత్రువుల్ని మనమే మన లైఫ్ లోకి రానిస్తామం.. అదే కొన్ని సందర్భాలలో తప్పకుండా శత్రువులను తీసుకురావాల్సి  వస్తుంది. ప్రతీ ఎపిసోడ్ చివరన చిన్న ట్విస్ట్ లాగా మేకర్స్ మార్చారు. బ్రేకప్ సీన్లకి కాస్త ఎక్కువ సమయం కేటాయించారు. అడల్ట్ కంటెంట్ ఉంది. మరో సీజన్ కూడా త్వరలో రాబోతుందనే హింట్ ఇచ్చారు మేకర్స్.  వివేక్ షా కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ బాగుంది‌. ఎడిటింగ్ చక్కగా కుదిరింది‌‌ నిర్మాణ విలువలు బాగున్నాయి ‌

నటీనటుల పనితీరు:

రఘు ఖన్నా గా ఇమ్రాన్ హష్మీ ప్రధాన బలంగా నిలిచాడు. మహికా నందీగా మహికా మాక్వానా ఇమ్రాన్ హష్మీ తో పోటీపడి నటించేసింది. మౌనీ రాయ్, శ్రీయా సరన్ మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : బాలివుడ్ కథలని ఇష్టపడేవారికి ఇది మంచి టైమ్ పాస్ అవుతుంది.

రేటింగ్ : 2.75 / 5

✍️. దాసరి  మల్లేశ్