ఈసారి లక్ష్యం మాల్స్ పోలీసులకు ఐఎం సవాల్
posted on Sep 9, 2011 9:40AM
న్యూ
ఢిల్లీ: తమ తదుపరి లక్ష్యం షాపింగ్ మాల్స్ అని ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ ప్రకటించింది. ఈ దాడులను దమ్ముంటే అడ్డుకోవాలని దేశ పోలీసులకు సవాల్ విసిరింది. అంతేకాకుండా ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్ళకు కూడా తమదే బాధ్యత అని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు పంపిన ఈ మెయిల్‌లో ఆ సంస్థ పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ఆవరణలో బాంబు పేలుళ్లకు పాల్పడింది కూడా తామేనని, హుజీ సంస్థ కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మున్ముందు మరిన్ని దాడులకు పాల్పడతామని ప్రకటించింది. ఇదిలావుండగా, ఈ పేలుళ్ళకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అనుమానితులను జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వీరి నుంచి పూర్తి సమాచారాన్ని లాగుతున్నారు.