మైనారిటీ కార్పొరేషన్ లో మరో భాగోతం
posted on Oct 16, 2012 12:59PM

రాష్ట్ర మైనారిటి నిధుల గోల్ మాల్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నకిలీ ఖాతాలలో ప్రైవేటు వ్యక్తులు రూ.55.47 కోట్లు కొట్టేయగా మరో రూ.132 కోట్లు 18 బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు మైనారిటీ సంక్షేమ ఉన్నతాధికారుల పరిశీలనలో బయటపడింది. వీటిలో రూ 128 కోట్లకు సంబంధించి పూర్తి వివరాలు లభ్యమయ్యాయి. మరో నాలుగు కోట్లకు సంబంధించి పూర్తి వివరాలు బయట పడకపోవడంతో అవి ఎక్కడున్నాయనే విషయంలో అనుమానం వ్యక్తం అవుతుంది. కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఇలియాస్ రిజ్వీ ఈస్థాయిలో ఎఫ్‌డీలు వేస్తున్నా సర్కారుకు సమాచారం లేకపోవడం గమనార్హం. మైనారిటీ సంక్షేమ శాఖలో బోధనా ఫీజుల విడుదలపై సాంఘిక, బీసీ సంక్షేమశాఖ అధికారులతో కూడిన టీమ్‌ల విచారణ వేగం పుంజుకుంది. సోమవారం హైదరాబాద్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు కాలేజీల్లో పరిశీలన జరిపినట్లు తెలిసింది. బోధనా ఫీజులు ఎక్కువగా మంజూరైన కాలేజీల్లోనే అధికారులు విచారణ జరుపుతున్నారు.